మనోజ్ సంగీత్లో బడా హీరోల స్టెప్పులు.. | ambarish, rajinikanth will shake leg in manchu manoj sangeeth | Sakshi
Sakshi News home page

మనోజ్ సంగీత్లో బడా హీరోల స్టెప్పులు..

May 1 2015 9:31 AM | Updated on Sep 3 2017 1:14 AM

మనోజ్ సంగీత్లో బడా హీరోల స్టెప్పులు..

మనోజ్ సంగీత్లో బడా హీరోల స్టెప్పులు..

మంచువారి ఇంట్లో చివరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటివరకు బాలీవుడ్కే పరిమితమై ఇటీవలె తెలుగు ప్రజలను పలకరిస్తున్నసంగీత్ కార్యక్రమం మంచువారి ఇంట్లో కనులవిందుగా జరగనుంది.

హైదరాబాద్: మంచువారి ఇంట్లో చివరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఒకప్పుడు బాలీవుడ్కే పరిమితమైన సంగీత్ కార్యక్రమం ఇప్పడు టాలీవుడ్ సెలెబ్రిటీల వివాహ వేడుకల్లో కామన్ అయిపోయింది. గతంలో చిరంజీవి, బాలకృష్ణ ఫ్యామిలీలో జరిగిన సంగీత్ లో హీరోలు చిందేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మంచువారి ఇంట్లో సంగీత్ వేడుక కనులవిందుగా జరగనుంది. దాదాపు ఐదు రోజులపాటు జరిగే ఈ తంతులో ప్రముఖ తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, కన్నడ నటుడు అంబరీశ్ అదిరిపోయే స్టెప్పులతో అలరించనున్నారట. నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ వివాహం మే 20న జరగనున్న విషయం తెలిసిందే. దాంతో మోహన్ బాబుకు స్నేహితులు, సన్నిహితులైన రజనీకాంత్, అంబరీష్ ఈ వేడుకలో అలరించనున్నారు.

ఇందుకోసం వారు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ లోని మోహన్ బాబు  నివాసంలో ఈ వేడుకకు వేదిక కానుంది. వరుసగా ఐదురోజులపాటు ధూమ్ ధామ్ గా కార్యక్రమాలు సిద్ధం చేశారు. వీటిలో ప్రతిరోజు సంగీత్ ఉంటుంది. మే 14 నుంచి వివాహ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటికి మనోజ్ సోదరి మంచు లక్ష్మీ యాంకరింగ్ చేయనున్నారు. ఈ వివాహానికి చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులందరు వస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement