నచ్చకపోతే అస్సలు మాట్లాడలేను : బన్నీ

Allu Arjun Speech In Vijetha Success Meet - Sakshi

చిరు చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా వచ్చిన విజేత సినిమా మంచి టాక్‌తో విజయవంతంగా నడుస్తోంది. ఈ మూవీలోని మురళీ శర్మ, కళ్యాణ్‌ నటనకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. విశ్వనాథ్‌ సినిమాల్లోని క్లైమాక్స్‌లా ఉందని మెగాస్టార్‌ చిరంజీవి కితాబునిచ్చారు. విజేత విజయోత్సవ సభను ఆదివారం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. బన్నీ విజేత గురించి మాట్లాడుతూ.. ‘నేను వచ్చేముందే సినిమా చూశాను. సినిమా నాకు చాలా నచ్చింది.  నచ్చకపోతే అస్సలు మాట్లాడలేను. ఫాదర్‌ సెంటిమెంట్‌ సీన్స్‌ చాలా కనెక్ట్‌ అయ్యాయి. నాకు మా ఫాదర్‌ అంటే ఇష్టముండటంతో ఆ సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి. సినిమాలోని పాటలు చాలా బాగున్నాయని, ముఖ్యంగా కోడి సాంగ్‌, మాన్సారే సాంగ్‌లు నచ్చాయి. హర్షవర్ధన్‌ మ్యూజిక్‌ అంటే నాకు ఇష్టం. తను చేసిన అర్జున్‌ రెడ్డి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో మురళీ శర్మ గారు చాలా బాగా నటించారు. ఈయన్ను అతిథి సినిమా నుంచి గమనిస్తున్నాను. చాలా బాగా యాక్ట్‌ చేస్తారు. కళ్యాణ్‌ ఎమోషనల్‌ సీన్స్‌లో ఎలా చేస్తారో అని అనుకున్నాను ,కానీ ఆటోలో మురళీ శర్మతో ఉన్న సీన్‌లో కళ్యాణ్‌ కనబడలేదు. క్యారెక్టర్‌ మాత్రమే కనబడింది. కళ్యాణ్‌ చాలా బాగా నటించారు. క్లైమాక్స్‌ చాలా బాగుంది. ట్విస్ట్‌ చాలా నచ్చింది’ అని అన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top