యూట్యూబ్‌ను ఆగం చేస్తున్న బన్నీ పాట

Allu Arjun Ramulo Ramula Song Halchal In Youtube - Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం నటిస్తున్న‘ అల.. వైకుంఠపురములో’ చిత్రంలోని సామజవరగమనా.. అనే పాట ఎలా దూసుకుపోయిందో తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ఆ పాట యూట్యూబ్‌లో సంచలనాలు రేపింది. తాజాగా ఆ సినిమాలోని మరో పాట ‘రాములో రాములా’ కూడా ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తోంది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇప్పటికి వరకు 45 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. టిక్‌ టాక్‌లో కూడా వేల వ్యూస్‌తో దూసుకుపోతూ.. క్రేజీ స్టార్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటను కాసర్ల శ్యామ్ ర‌చించగా, తమ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ గీతాన్ని అనురాగ్ కుల‌క‌ర్ణి, మంగ్లీ ఆల‌పించారు. విడుదలైన రెండు పాటలకి మంచి రెస్ఫాన్స్‌ రావడంతో బన్నీ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. 

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను  సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది  జనవరిలో విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top