అభిమానికి క్షమాపణలు చెప్పిన హీరో | Akshay Kumar says sorry after bodyguard punches fan | Sakshi
Sakshi News home page

అభిమానికి క్షమాపణలు చెప్పిన హీరో

Apr 30 2016 4:01 PM | Updated on Aug 20 2018 2:50 PM

అభిమానికి క్షమాపణలు చెప్పిన హీరో - Sakshi

అభిమానికి క్షమాపణలు చెప్పిన హీరో

బాలీవుడ్ బడా హీరో అక్షయ్ కుమార్ ఓ అభిమానికి క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనకు తీవ్రంగా చింతిస్తున్నానంటూ ట్విట్టర్ వేదికగా వివరించారు.

బాలీవుడ్ బడా హీరో అక్షయ్ కుమార్ ఓ అభిమానికి క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనకు తీవ్రంగా  చింతిస్తున్నానంటూ ట్విట్టర్ వేదికగా వివరించారు. అక్షయ్ గురువారం ముంబై ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. అభిమాన హీరోని చూసిన ఫ్యాన్స్ ఆనందంతో ఆయన్ను చుట్టుముట్టేశారు. ఆటోగ్రాఫ్ల కాలం చెల్లి ఫొటోగ్రాఫ్లు నడుస్తుండటంతో ఓ అభిమాని అక్షయ్తో సెల్ఫీ దిగేందుకు సరదా పడ్డాడు.  ముందుకు చొచ్చుకు వచ్చిన అతడిని అక్షయ్ బాడీగార్డ్.. అతనికి ఓ పవర్ఫుల్ పంచ్ ఇచ్చాడు.

ఇదంతా ఆ మరుసటి రోజు తెలుసుకున్న అక్షయ్ కుమార్  ట్విట్టర్లో క్షమాపణలు తెలిపారు. ఆ రోజు ఎయిర్ పోర్టులో నడుస్తుండగా అనుకోకుండా అలా జరిగిందని.. ఆ హడావుడిలో చుట్టూ ఏం జరుగుతుందనేది తాను గమనించలేదని, విషయం ఆలస్యంగా తెలుసుకున్నానని వెల్లడించారు. జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నానని.. బాధితుడైన తన అభిమానికి మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాని తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ బాధిస్తాయని.. ఈ విషయమై తన బాడీగార్డుని గట్టిగా మందలించానని చెప్పారు. భవిష్యత్లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటానంటూ వివరించారు.

అక్కీ మనసుకి అభిమానులు ఫిదా అయిపోయారు. జరిగినదానికి స్వయంగా వివరణ ఇస్తూ అభిమానికి క్షమాపణలు చెప్పడంతో మరింత అభిమానులయ్యారు. 'వియ్ లవ్ అక్షయ్ కుమార్' అనే ట్యాగ్ తో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement