
గే పాత్రలో ప్రముఖ హీరో
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఫవాద్ ఖాన్ బాటలోనడువనున్నాడు. రోహిత్ ధవన్ దర్శకత్వం వహిస్తున్న 'డిష్యుం' సినిమాలో ఆయన గే పాత్రలో కనిపించనున్నాడు.
గే పాత్రలో స్కట్ ను ధరించి అక్షయ్ కనిపిస్తాడు. మార్షల్ ఆర్ట్ ఫైట్స్ తో ఇన్నాళ్లూ తన కంటూ ఒక మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఈ మాస్ హీరో గే పాత్రలో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాల్సిందే. జాన్ అబ్రహం,వరుణ్ ధవన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'డిష్యుం' ఈ సినిమా జులై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.