మరో గోల్డ్‌ దక్కింది

Akshay Kumar gets Instagram mememto on 20 mn followers - Sakshi

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, సినిమా విశేషాలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారాయన. అందుకే ఆయనకు ఫాలోయర్స్‌ కూడా ఎక్కువే. ఈ ఫాలోయర్స్‌ విషయంలో అరుదైన రికార్డు సాధించారాయన. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో 20 మిలియన్ల (2 కోట్లు) ఫాలోయర్స్‌ ఉన్న తొలి బాలీవుడ్‌ నటుడిగా నిలిచారు అక్షయ్‌.

ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ ఆయనకు ప్రత్యేక జ్ఞాపికను బహూకరించింది. ‘‘ఇన్‌స్టాగ్రామ్‌ యాజమాన్యం నాకు మరో ‘గోల్డ్‌’ (ఇటీవల రిలీజైన తన ‘గోల్డ్‌’ సినిమా పేరు వచ్చేట్లుగా) బహుమతిగా ఇచ్చింది. 20 మిలియన్ల ఫాలోయర్స్‌ మైలురాయిని అందుకున్న తొలి బాలీవుడ్‌ నటుడ్ని నేను కావడం వెరీ హ్యాపీ. ఈ ఘనత మీ వల్లే (ఫాలోయర్స్‌) సాధ్యమైంది. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. మీకు నా ప్రేమ, ప్రార్థనలు పంపుతున్నా’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పంపిన జ్ఞాపిక ఫొటోను షేర్‌ చేశారు అక్షయ్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top