అదుగో : పందిపిల్లతో ఫిట్‌నెస్‌ చాలెంజ్‌

Adugo Promotion Ravi Babu Pushup With Piglet - Sakshi

విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు, పందిపిల్ల ప్రధాన పాత్రలో అదుగో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గ్రాఫిక్స్‌ వర్క్‌ కారణంగా ఆలస్యమవుతోంది. అయితే సినిమా మీద ఆసక్తి కొనసాగించేందుకు రవిబాబు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో నోట్ల రద్దు సమయంలో పందిపిల్లతో కలిసి ఏటీయం క్యూలో నిల్చోని అందరి దృష్టిని ఆకర్షించారు.

తాజాగా మరోసారి అదే తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఫిట్‌నెస్ చాలెంజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఈ సందర్భాన్ని తన సినిమా ప్రచారానికి వినియోగించుకున్న రవిబాబు. బంటీ(పందిపిల్ల)తో కలిసి కసరత్తులు చేస్తున్న వీడియోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేశారు. పందిపిల్లను వీపుపై ఎక్కించుకుని పుల్‌అప్స్‌ చేశారు. ‘ బంటి ఫిట్‌నెస్‌ కోసం వ్యాయామం చేయగలుగుతోందని, మరి మీరు ఎందుకు చేయర’ని ప్రశ్నించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top