హాలీవుడ్‌కు నెపోలియన్‌ | Actor Nepolian Entry In Hollywood Movie | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌కు నెపోలియన్‌

Dec 6 2017 8:30 AM | Updated on Dec 6 2017 8:30 AM

Actor Nepolian Entry In Hollywood Movie - Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో మావీరన్‌గా పేరుగాంచిన నటుడు నెపోలియన్‌ హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు డెవిల్స్‌ నైట్‌–డాన్‌ అఫ్‌ ది నైన్‌ రుజ్‌ అనే అమెరికన్‌ చిత్రం ద్వారా నెపోలియన్‌ హాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. కోలీవుడ్‌లో ప్రతి నాయకుడిగా రంగప్రవేశం చేసి, ఆ తరువాత కథానాయకుడిగా దక్షిణాదిలోని పలు భాషల్లో శతాధిక చిత్రాల్లో నటించిన ఈయన రాజకీయరంగప్రవేశం చేసి ఎంపీ గానూ, కేంద్రమంత్రిగానూ బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం అమెరికాలోనే ఎక్కువగా నివశిస్తున్న నెపోలియన్‌ తొలిసారిగా హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు.

డెవిల్స్‌ నైట్‌ అనే హర్రర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన టెల్‌ గణేశన్‌ కైపా ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఎమ్మీ నామినేటెట్‌ దర్శకుడు శ్యామ్‌ లోగన్‌ కరేలి దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్‌ నటులు జెసీ జెన్సన్, బాబీలెనిన్, జాక్‌ సీ, ఫార్మన్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఇది హర్రర్‌ కథా చిత్రం అని సోమవారం చెన్నైలో చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నెపోలియన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement