ప్రభుదేవా, తమన్నా రేర్‌ రికార్డ్‌!

Abhinetri 2 Pair Tamannah and Prabhudeva Creates Record - Sakshi

డాన్సింగ్ స్టార్‌ ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హార్రర్‌ థ్రిల్లర్‌ అభినేత్రి 2. సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే జోడి కలిసి నటించిన మరో హార్రర్‌ థ్రిల్లర్‌ మూవీ ఖామోషీ. చక్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బాలీవుడ్‌ మూవీ కూడా మే 31న ప్రేక్షకుల ముందు రానుంది.

ఇలా ఒకే జంట కలిసి నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్‌ కావటం అరుదైన రికార్డ్‌ అంటున్నారు సినీ విశ్లేషకులు. అభినేత్రి 2 కూడా దేవీ 2 పేరుతో బాలీవుడ్ లో రిలీజ్‌ అవుతోంది. ఇలా ఒకే రోజు ఒకే జంట నటించిన ఒకే జానర్‌ సినిమాలు రెండు ప్రేక్షకుల ముందుకు రావటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top