ఆకట్టుకునేలా ఆది, శ్రద్ధాల ‘జోడి’

Aadi, Shraddha Srinath Starrer Jodi Movie Trailer Released - Sakshi

ఆది సాయి కుమార్‌ హీరోగా, జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ జోడి. విశ్వనాథ్‌ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భావన క్రియేషన్స్‌ బ్యానర్‌పై గుర్రం శ్రీనివాస్‌ సమర్పణలో పద్మజ, సాయి వెంకటేష్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాలో ఆది, శ్రద్ధాల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. తండ్రి పాత్రలో సీనియర్‌ నరేస్‌ మరోసారి మంచి కామెడీతో పాటు బరువైన సెంటిమెంట్‌ను కూడా పండించారు. ఫణి కల్యాణ్ సంగీతమందించిన ఈ సినిమా వెన్నెల కిశోర్‌, సీనియర్‌ నటులు గొల్లపూడి మారుతీరావు, మిర్చి మాధవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top