అందుకే నేను, నా భార్య విడిపోయాం | Vamshidhar Sad Ending Telugu Love Stories | Sakshi
Sakshi News home page

అందుకే నేను, నా భార్య విడిపోయాం

Dec 13 2019 3:00 PM | Updated on Dec 13 2019 3:19 PM

Vamshidhar Sad Ending Telugu Love Stories - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మాది కరీంనగర్‌ జిల్లా. నా చిన్నప్పటి క్లాస్‌మేట్‌ పేరు వినీత. తనంటే నాకు చాలా ఇష్టం. తను మా ఇంటి ఎదురుగా ఉండేది. మా ఇద్దరి ఫాదర్స్‌ ఒకే కంపెనీలో జాబ్‌ చేసేవారు. అనుకోకుండా వాళ్లు పనిచేస్తున్న కంపెనీ షట్‌డౌన్‌ అయ్యింది. తర్వాత వాళ్లు ఊరు వదిలి పెట్టి హైదరబాద్‌ వెళ్లిపోయారు. తను ఎక్కడఉందో అని చాలా వెతికాను. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వాళ్ల నాన్న ఓ ఫంక్షన్‌కు వచ్చారు. అప్పుడు తన నెంబర్‌ తీసుకున్నా. తను అప్పుడు వేరే జిల్లాలో బీడీఎస్‌ చదువుతోంది. నెంబర్‌ తీసుకున్న వెంటనే తనకు కాల్‌ చేశా. ఆ ఆత్రుతలో తనను కలవటానికి ఆఫీసుకు లీవ్‌ పెట్టి మరీ అక్కడి వెళ్లాను. తనను చూశా! ఏదో చెప్పలేని సంతోషం.

అలా చూస్తూ ఉండిపోయా. అలా రోజులు గడిచేకొద్ది నేను తనని కలవటానికి వెళ్లటం రొటీన్‌ అయ్యింది. ఈలోపు తను గ్రాడ్యుయేషన్‌ కంప్లీట్‌ చేసి హైదరబాద్‌ వచ్చేసింది. కొన్ని రోజుల తర్వాత నేను తనకు ప్రపోజ్‌ చేశా. మా కులాలు వేరు వేరు కావటంతో అందుకు తను స్పందించలేదు. కొన్ని రోజుల తర్వాత తను నాకు ఓకే చెప్పింది. ఇంక నా సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. నా చిన్ననాటి స్నేహితురాలు నా జీవిత భాగస్వామి అవుతోందని. అలా రోజులు గడిచాక మా ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి సంబంధాలు చూడటం స్టార్ట్‌ చేశారు. నేను తనకు చెప్పి వాళ్ల ఇంట్లో వాళ్లతో మాట్లాడమన్నా. అదే సమయంలో వాళ్ల కజిన్‌ సిస్టర్‌ లవ్‌ మ్యారేజ్‌ చేసుకోవటం వలన వాళ్లను కంప్లీట్‌ ఫ్యామిలీ దూరం పెట్టేశారు.

తనకి ఆ భయం పట్టుకుంది. చాలా నరకం అనుభవించాం ఇద్దరం. కొద్దిరోజుల తర్వాత మా డాడీ ఫ్రెండ్‌ కూతురితో నాకు పెళ్లి నిశ్చయం అయ్యింది! నాకు ఇష్టం లేకుండానే. నా పెళ్లికి గంటముందు కూడా తనతో మాట్లాడా.. ఏమైనా పాజిటివ్‌గా స్పందిస్తుందేమోనని. కానీ, అలా ఏమీ జరగలేదు. ఇద్దరం చాలా ఏడ్చాము. తర్వాత నాకు పెళ్లైంది. పెళ్లైన ఒక నెల తర్వాత నా భార్య మాకు సంబంధించిన పాత మెసేజ్‌లు చదివింది. నాకు తెలియకుండా నా వైఫ్‌ ఆ అమ్మాయికి కాల్‌ చేసి తిట్టింది. తర్వాత ఆమెతో మాట్లాడటం మానేశాను. అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. మా వైఫ్‌ వాళ్ల పేరెంట్స్‌ టార్చర్‌ వల్లే నేను నా భార్య విడిపోయాం.

ఐదేళ్ల నుంచి కేసు కోర్టులో నడుస్తోంది . అనుకోకుండా ఓ రోజు వినీత పుట్టిన రోజు నాడు మా కామన్‌ ఫ్రెండ్‌ ఆమెను వాట్సాప్‌ గ్రూపులో ఆడ్‌ చేశాడు. నేను శుభాకాంక్షలు చెప్పినా నాకు సంతృప్తిగా అనిపించలేదు. ఫోన్‌ చేయాలా.. వద్దా.. అని డైలమాలో ఉండిపోయా. ఈవినింగ్‌ ఫోన్‌ చేసి విష్‌ చేశా. పది సంవత్సరాల తర్వాత ఫోన్‌ చేసినా తను నా వాయిస్‌ను గుర్తుపట్టింది. తనకి పెళ్లై ఒక పాప ఉంది. తను నా లైఫ్‌లో లేకపోయినా. అప్పుడప్పుడు తనతో మాట్లాడుతుంటే నా ప్రాబ్లమ్స్‌ అన్నీ మర్చిపోతున్నట్లు అనిపిస్తుంది. తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా  ఉండాలని కోరుకునే వాడిలో నేను మొదటివాడ్ని. 
- వంశీధర్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement