
భర్త రోజూలాగే ఆ రోజు కూడా ఉత్తరాల కోసం ఇంటి బయట ఉన్న...
కొలంబస్ : భార్యాభర్తలన్న తర్వాత ఒకరినొకరు ఆటపట్టించుకోవటం మామూలే. కొంతమందైతే ఒకరినొకరు భయపెట్టుకుని సరదా పడుతుంటారు. ఓహియోకు చెందిన ఓ మహిళ తన భర్తను ఆటపట్టించటానికి అతని భయాన్ని ఆసరాగా చేసుకుంది. సరదాగా ఆమె చేసిన పనికి భర్త హడలిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఓహియోకు చెందిన ఓ మహిళ తన భర్తను ఆటపట్టించాలని అనుకుంది. భర్తకు ఓఫిడియోఫోబి ఉండటంతో ఆమెకు కలిసోచ్చింది. అనుకున్నదే తడవుగా ఉత్తరాలు వగైరా పడేసే మెయిల్ బాక్స్‌ను ఇందుకు అనువుగా ఎంచుకుంది. భర్త రోజూలాగే ఆ రోజు కూడా ఉత్తరాల కోసం ఇంటి బయట ఉన్న బాక్సును తెరిచాడు. అంతే! లోపల నల్లటి త్రాచు పాము ఉండటం చూసి ఒక్కసారిగా హడలి బిక్కచచ్చిపోయాడు.
లోపల ఉన్న పామును బయటకు రాకుండా చేయటానికి నానా తంటాలు పడ్డాడు. చివరకు అది బొమ్మపామని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నాడు. అది తన భార్య పనేనని తెలిసి ఆమెపై రంకెలేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన ఓ నెటిజన్.. ఆ స్థానంలో నేనుంటే గనుక నా భార్యకు విడాకులిచ్చేవాణ్ని అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.
