త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌

WhatsApp might launch self destructing messages feature for individual accounts - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: ఇటీవల డార్క్‌ మోడ్‌ను ప్రవేశపెట్టిన వాట్సాప్‌ త్వరలో స్వీయ అంతర్ధాన సందేశ (సెల్ఫ్‌ డిస్ట్రక్షన్‌ మెసేజెస్‌) వెసులుబాటును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే యూజర్లు తాము పంపే మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా డిలీట్‌ చేసేలా సెట్టింగు పెట్టుకోవచ్చు. నిర్ణీత కాలం తర్వాత (గంట, రోజు, వారం, నెల, సంవత్సరం) ఆ మెసేజ్‌లు డిలీట్‌ అయిపోతాయి. ఈ ఫీచర్‌పై వాట్సాప్‌ డెవలపర్లు కసరత్తులు చేస్తున్నట్లు ఓ టెక్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. మొదటగా ఈ ఫీచర్‌ను గ్రూపు చాట్‌లకు మాత్రమే పరిమితం చేసే యోచననలో ఉన్నారు. గ్రూపు సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్‌కు సంబంధించిన మరిన్ని సెట్టింగులను ఉంచనున్నారు. ఇతర ఫీచర్లలాగే మొదట ఇది వాట్సాప్‌ బీటా యూజర్లకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి పరిశీలన అనంతరం అప్‌డేట్‌ ద్వారా యూజర్లందరికీ అందిస్తారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top