అండం... విలువ బ్రహ్మాండం! | Sakshi
Sakshi News home page

అండం... విలువ బ్రహ్మాండం!

Published Tue, Apr 8 2014 4:24 AM

అండం... విలువ బ్రహ్మాండం!

సోమవారం సెంట్రల్ లండన్‌లో పురాతన వస్తువుల వేలం సంస్థ ‘వార్ట్‌స్కీ’ ప్రారంభించిన నాలుగు రోజుల ప్రదర్శనలో ఉంచిన పురాతన బంగారు ‘ఈస్టర్ ఎగ్’ ఇది. మూస్తే గుడ్డు మాదిరిగా.. తెరిస్తే లోపల గడియారం ఉండటం దీని ప్రత్యేకత. పీటర్ కార్ల్ ఫెబర్జ్ అనే నిపుణుడు 1890ల కాలంలో రష్యా చక్రవర్తుల కోసం ఇలాంటి 8 ఫెబర్జ్ ఎగ్స్‌ను తయా రు చేశాడట.

తర్వాత అవి అదృశ్యం కాగా.. వాటిలో ఇది ఒకటని భావిస్తున్నారు. దీని విలు వ రూ.200 కోట్లు ఉంటుందట. అయితే అమెరికాలోని ఓ ఇనుప తుక్కు మార్కెట్లో ఓ ఇనుప సామగ్రి డీలర్ ఈ అండాన్ని కొనుగోలు చే శాడు. అతడి నుంచి రూ. 8.41 లక్షలకే కొన్నేళ్ల క్రితం దీనిని సొంతం చేసుకున్న వార్ట్‌స్కీ ఇప్పుడు ఓ ప్రైవేటు వ్యక్తికి ఏకంగా ఎన్నోరెట్ల భారీ మొత్తానికి విక్రయించనుందట.

Advertisement
Advertisement