ఆ మహిళా ఉగ్రవాది చివరి మాటేంటి? | the final words of Hasna Ait Boulahcen | Sakshi
Sakshi News home page

ఆ మహిళా ఉగ్రవాది చివరి మాటేంటి?

Nov 20 2015 7:48 PM | Updated on Oct 5 2018 9:09 PM

ఆ మహిళా ఉగ్రవాది చివరి మాటేంటి? - Sakshi

ఆ మహిళా ఉగ్రవాది చివరి మాటేంటి?

పారిస్‌లో గత శుక్రవారం నరమేధం సృష్టించిన ఉగ్రవాద దాడిలో తనను తాను పేల్చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళా ఉగ్రవాది హస్నా ఐతబౌలాచ్న్ ఆఖరి గడియలకు సంబంధించిన వీడియో ఒకటి విడుదలైంది.

పారిస్: పారిస్‌లో గత శుక్రవారం నరమేధం సృష్టించిన ఉగ్రవాద దాడిలో తనను తాను పేల్చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళా ఉగ్రవాది హస్నా ఐతబౌలాచ్న్ ఆఖరి గడియలకు సంబంధించిన వీడియో ఒకటి విడుదలైంది. తాను ఉన్న అపార్ట్ మెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు ఆ ఉగ్రవాది ఎక్కడా ఎక్కడా అంటూ గట్టిగా కేకలు వేస్తుండటం ఆమె విన్నది.

పోలీసుల తుపాకుల లైట్లు ఆమె గదిపై పడ్డాయి. ఆ క్షణంలో ఏవో కేకలు వేయడంతోపాటు రెండు ఆడియో ఫుటేజీల్లో ఒక దాని ప్రకారం 'అతడు నా బోయ్ ఫ్రెండ్ కాదు' అంటూ గట్టిగా మొత్తుకుంది. క్షణాల్లో తనను తాను పేల్చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement