వివాదాస్పద యాడ్‌పై స్పందించిన కెందాల్‌ | Super Model Reacts on Controversial Ad | Sakshi
Sakshi News home page

వివాదాస్పద యాడ్‌పై స్పందించిన నటి

Sep 2 2017 10:08 AM | Updated on Sep 19 2017 12:59 PM

వివాదాస్పద యాడ్‌పై స్పందించిన కెందాల్‌

వివాదాస్పద యాడ్‌పై స్పందించిన కెందాల్‌

నల్ల జాతి ఉద్యమాన్ని అవహేళన చేసేలా తీసిన పెప్సీ యాడ్‌ లో నటించిన నటి...

సాక్షి, వాషింగ్టన్‌: సూపర్ మోడల్, నటి కెందాల్‌ జెన్నర్‌ ఎట్టకేలకు వివాదాస్పద యాడ్‌ పై నోరు విప్పింది. ఈ యేడాది మొదట్లో ఆమె చేసిన ఓ డ్రింక్‌ యాడ్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. 
‘ఆ యాడ్ చేసి చాలా పెద్ద తప్పు చేశా. విమర్శల నేపథ్యంలో మానసికంగా కుంగిపోయా. నా జీవితం ముగిసిందనే భావించా. కానీ, పరిస్థితి ఇప్పుడు సర్దుమణిగింది. మళ్లీ మాములు జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యా అని 21 ఏళ్ల కెందాల్ చెబుతున్నారు.
ప్రముఖ శీతలపానీయ సంస్థ పెప్సీ రూపొందించిన యాడ్ లో కెందాల్ నటించింది. అయితే నల్లజాతి ఉద్యమాన్ని కించపరిచేలా ఉందంటూ ఆ సమయంలో విమర్శలు వినిపించాయి. దీంతో క్షమాపణలు తెలియజేసిన పెప్సీ సంస్థ ఆ యాడ్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి కెందాల్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు ఓ ఇంటర్వ్యూ ద్వారా యాడ్ పై స్పందించింది. 
యాడ్ విషయానికొస్తే.. బ్లాక్ లైవ్స్ పేరిట కొందరు ఆందోళనకారులు ర్యాలీ చేస్తుండగా, అక్కడున్న పోలీసులు అడ్డుకుంటారు. పక్కనే ఫోటో షూట్ చేస్తున్న కెందాల్ ఇది గమనించి పెప్సీ టిన్‌లను ఇచ్చి పోలీసులను ఛిల్‌ చేస్తుంది. అయితే సామాజిక పోరాటాన్ని అవహేళన చేశారంటూ రాజకీయ విమర్శలు ఎదురుకాగా, తప్పు చేశావంటూ కెందాల్ సోదరి కిమ్‌ కర్దాషియన్‌ కూడా అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement