మోకాలిపై నిలబడకపోవడంపై క్షమాపణలు కోరిన డికాక్‌

Quinton De Kock Apologises Pledges To Kneel Down - Sakshi

Quinton De Kock Apologises For Refusing To Take Knee: ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికలపై ఆటగాళ్లు సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌ ఆరంభానికి ముందు.. దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు(సీఎస్‌ఏ) సైతం మోకాలిపై కూర్చుని ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా ఆ దేశ ఆటగాళ్లను ఆదేశించింది. అయితే ఆ జట్టు వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ మాత్రం ఇందుకు ససేమిరా అన్నాడు. ఏకంగా జట్టు నుంచే తప్పుకున్నాడు. అయితే, సదరు అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్‌ఏ చివరి అవకాశం ఇవ్వడంతో తాజాగా అతను దిగొచ్చాడు. 

జట్టు సభ్యులకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా నిలబడడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నానని, తదుపరి మ్యాచ్‌లో మోకాలిపై నిల్చొని ఉద్యమానికి మద్దతు తెలుపుతానని అన్నాడు. ఈ సున్నితమైన అంశాన్ని రాద్దాంతం చేయడం, ఎవరినీ అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. తన చర్యలు ఎవరినైనా బాధించి ఉంటే పెద్ద మనసుతో తనను క్షమించాలని కోరాడు. జట్టుతో చేరేం‍దుకు తాను సుముఖంగా ఉన్నానని తెలిపాడు. కాగా, మొదట్లో ఈ అంశంపై స్పందించేందుకు కూడా ఇష్టపడని డికాక్‌.. ఓ దశలో కెరీర్‌ను అర్ధంతరంగా ముగించేందుకు సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం.   
చదవండి: David Warner: మోకాలిపై కూర్చుంటాం... ఆ విషయం గురించి స్పందించలేను!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top