T20 World Cup 2021: మోకాలిపై కూర్చుంటాం... ఆ విషయం గురించి స్పందించలేను: వార్నర్‌

T20 World Cup 2021: David Warner Says Australia Team Will Take A Knee - Sakshi

David Warner Response On Quinton De Kock Sitting Out: ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు సంఘీభావం ప్రకటిస్తుందని ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వెల్లడించాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఆసీస్‌ ఆటగాళ్లందరూ మైదానంలో మోకాలిపై కూర్చొని మద్దతునిస్తారని అతను స్పష్టతనిచ్చాడు. ‘దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఇచ్చిన ఆదేశాలపై నేను స్పందించలేను. మేం మాత్రం మోకాలిపై కూర్చొని సంఘీభావం ప్రకటిస్తాం. దానికి మేం సిద్ధం’ అని వార్నర్‌ అన్నాడు. 

కాగా జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికలపై ఆటగాళ్లు సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌ ఆరంభానికి ముందు.. దక్షిణాఫ్రికా బోర్డు సైతం మోకాలిపై కూర్చుని ఉద్యమానికి మద్దతు పలకాల్సిందిగా ఆటగాళ్లకు ఆదేశాలు ఇచ్చింది. అయితే, వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ మాత్రం.. ఇందుకు అభ్యంతరం తెలిపాడు. అలా చేయనని చెబుతూ జట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలో డికాక్‌ నిర్ణయం గురించి వార్నర్‌ను ప్రశ్నించగా... ఈ మేరకు స్పందించాడు.

చదవండి: NAM VS SCO: టి20 ప్రపంచకప్‌ చరిత్రలో క్రేజీ ఓవర్‌ అంటున్న ఫ్యాన్స్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top