Quinton De Kock: మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్ ఔట్.. కారణం

Quinton De Kock Pulled Out Vs WI Match.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా వెస్డీండీస్‌తో మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా సిద్ధమైన వేళ మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ రూపంలో షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌కు అతను దూరంగా ఉండనున్నాడని.. అతని స్థానంలో రీజా హెండ్రిక్స్ ఆడుతాడంటూ జట్టుకు కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించాడు. అయితే డికాక్ వ్యక్తిగత కారణాల రిత్యా విండీస్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని బవుమా పేర్కొన్నప్పటికి అసలు కారణం వేరే ఉందని సమాచారం.
చదవండి: T20 WC: చెత్త ప్రదర్శన.. ప్రపంచకప్ ఆడటానికి వచ్చారా.. టూరిస్ట్ వీసా మీద ఉన్నారా?
బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి మద్దతుగా టి20 ప్రపంచకప్‌లో వివిధ జట్లు వివిధ పద్దతుల్లో మద్దతు తెలుపుతున్నాయి. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఇకపై తాము ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో మొకాళ్లపై నిలబడి బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ మూమెంట్‌కు మద్దతు తెలపాలంటూ క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు(సీఎస్‌ఏ) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విషయంలో విండీస్‌తో మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు సీఎస్‌ఏతో డికాక్ గొడవకు దిగినట్లు సమాచారం. బ్లాక్‌లైవ్ మ్యాటర్స్ ఉద్యమానికి తాను వ్యతిరేకి కాదని.. కానీ మొకాళ్లపై కూర్చొని మద్దతు పలకలేనని తెలిపినట్లు సమాచారం. కేవలం ఈ కారణంతోనే డికాక్ కీలకమ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అయితే డికాక్ మాత్రం అలాంటిదేం లేదని.. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నానని.. అనవసరంగా దీన్ని పెద్ద విషయం చేయొద్దంటూ మీడియాను విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
చదవండి: T20 WC 2021 SA Vs WI: విండీస్ మూడో వికెట్ డౌన్.. సిమన్స్(16) ఔట్
🚨 TEAM ANNOUNCEMENT
🇿🇦 There's one change as Reeza Hendricks comes in for Quinton de Kock
📝 Ball by Ball https://t.co/c1ztvrT95P#SAvWI #T20WorldCup #BePartOfIt pic.twitter.com/0blL4GviNO
— Cricket South Africa (@OfficialCSA) October 26, 2021