మిస్‌ ఇండియా ‘వరల్డ్‌వైడ్‌’గా శ్రీ సైనీ | Shree Saini from USA crowned Miss India Worldwide 2018 | Sakshi
Sakshi News home page

మిస్‌ ఇండియా ‘వరల్డ్‌వైడ్‌’గా శ్రీ సైనీ

Dec 16 2018 4:50 AM | Updated on Dec 16 2018 8:02 AM

Shree Saini from USA crowned Miss India Worldwide 2018 - Sakshi

వాషింగ్టన్‌: మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ కిరీటం భారతీయ అమెరికన్‌ యువతి శ్రీ సైనీ(22)కి దక్కింది. న్యూజెర్సీలోని ఫోర్డ్స్‌ సిటీలో శనివారం జరిగిన 27వ ప్రపంచ పోటీల్లో 17 దేశాల్లోని భారతీయ సంతతికి చెందిన యువతులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన సాక్షి సిన్హా, బ్రిటన్‌కు చెందిన అనూషా సరీన్‌ మొదటి, రెండో రన్నర్‌ అప్స్‌గా ఎంపికయ్యారు. శ్రీ సైనీకి 12 ఏళ్ల వయస్సులోనే గుండె చికిత్స జరిగింది. ఆరోగ్య కారణాల రీత్యా డ్యాన్స్‌ చేయవద్దని వైద్యులు హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె మనోనిబ్బరం కోల్పోలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement