84 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి | Rupert Murdoch marries ex model Jerry Hall | Sakshi
Sakshi News home page

84 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి

Mar 6 2016 12:33 PM | Updated on Jul 11 2019 8:38 PM

84 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి - Sakshi

84 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి

ఐదు నెలల ప్రణయ సల్లాపాలకు శుభం కార్డు వేస్తూ.. 84 ఏళ్ల రూపర్ట్‌ మర్డోక్‌ మళ్లీ పెళ్లి కొడుకు అయ్యాడు.

లండన్: ఐదు నెలల ప్రణయ సల్లాపాలకు శుభం కార్డు వేస్తూ.. 84 ఏళ్ల రూపర్ట్‌ మర్డోక్‌ మళ్లీ పెళ్లి కొడుకు అయ్యాడు. మాజీ సూపర్ మోడలైన తన ప్రేయసి జెర్రీ హాల్‌ (59)ను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. లండన్‌లోని ప్రిన్స్ డయానా పూర్వీకుల రాజభవనమైన స్పెన్సర్ హౌజ్‌లో వీరి పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగింది.

మీడియా మొఘల్‌, న్యూస్‌ క్రాప్ చైర్మన్ అయిన మర్డోక్‌ ఐదు నెలల కిందట ఆస్ట్రేలియాలో జెర్రీ హాల్‌ను కలిశాడు. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిన ఈ ముదిమి ప్రేమికుడు ఐదునెలలుగా జెర్రీతో డేటింగ్ చేస్తున్నాడు. గత అక్టోబర్‌లో లండన్‌లో రగ్బీ యూనియన్ వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా ఈ ఇద్దరు కలిసి ఫొటోలకు పోజు ఇవ్వడంతో వీరి మధ్య ఏదో ఉందని ఊహాగానాలు వినిపించాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ తమ బంధాన్ని పెళ్లి వైపు నడిపిస్తూ గత జనవరిలో లాస్‌ ఏంజిల్స్‌లో ఈ ఇద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా కుబేరుడైన మర్డోక్ జెర్రీ చేతివేలికి అక్షరాల 4.2 మిలియన్ పౌండ్ల ఉంగరం తొడిగారు.

ఈ ఇద్దరి వివాహం కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య సాదాసీదాగా జరిగినప్పటికీ, శనివారం లండన్‌లోని చారిత్రక సెయింట్ బ్రైడ్స్ చర్చిలో వివాహ విందు ఘనంగా జరుగనుంది. తమ పెళ్లి అనంతరం మర్డోక్‌ స్సందిస్తూ తాను ప్రపంచంలోనే అదృష్టవంతుడిని, ఆనందమైన వ్యక్తిని అని ట్వీట్ చేశాడు. 'రానున్న పదిరోజులు లాదా మరెప్పుడు ట్వీట్స్ చేయను. ప్రపంచంలోనే అదృష్టవంతుడిని, ఆనందమైన వ్యక్తిని అనే భావన కలుగుతోంది' అని ఆయన పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement