కొందరికి ఇలాగ కూడా సాయం చేయొచ్చు!

Reporter Thanks Viewer For Saving Her Life - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కొందరికి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా మేలు జరుగుతుందో తెలియదు, ఊహించలేము కూడా. ఇంగ్లండ్‌లోని ‘నెట్‌వర్క్‌ టెన్‌’ టీవీలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న అంటాయినెట్‌ లత్తాఫ్‌ను అనూహ్యంగా అలాంటి మేలే జరిగింది. గత శుక్రవారం ఆమె టీవీలో ఏదో కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఆమె గొంతు వద్ద తిత్తిలాగా ఉబ్బుగా కనిపించింది. దీన్ని గమనించిన వెండీ మాక్‌కాయ్‌ అనే ప్రేక్షకుడు వెంటనే ఆమెకు ఓ సందేశం పింపించారు. ‘మీ గొంతు కింద తిత్తిలాగా కనిపిస్తోంది. వెంటనే వైద్యుడికి చూపించండి, లేకపోతే ప్రమాదం’ ఆ సందేశం సారాంశం. 

 లత్తాఫ్, తమ వంశంలో ‘థైరాడ్‌ క్యాన్సర్‌’ ఉండడంతో ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించారు. మూడు రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్‌లు చేసి వైద్యులు ఆమెకు ‘థైరోగ్లాసల్‌ డక్ట్‌ సిస్ట్‌’ ఉన్నట్లు ధ్రువీకరించారు. స్వర పేటికపై నుండే థైరాడ్‌ గ్రంధిలో అదనపు కణాలు పెరిగి రావడం వల్ల ఈ తిత్తి ఏర్పడుతుందని, అది క్రమంగా పెరగడం వల్ల శ్వాస సరిగ్గా ఆడదని, సరిగ్గా తినదీయదని, మాటలు సరిగ్గా రావని వైద్యులు చెప్పారు. వారి సలహా మేరకు లత్తాఫ్‌కు ఆమె శస్త్ర చికిత్స చేసి ఆ తిత్తిని తీసివేశారు. ఇద్దరు పిల్లలు భర్త ఉన్న ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. 

‘నా పట్ల శ్రద్ధ చూపించి నా జబ్బును ముందుగా కనుక్కొని సకాలంలో తెలియజేసినందుకు ధన్యవాదాలు’ అంటూ విక్టోరియా ప్రాంతంలో నివసిస్తున్న వెండీకి ఆమె సందేశం పంపించారు. ‘మీరు వైద్యులా, ఎలా కనిపెట్టారు?’ సోషల్‌ మీడియా వెండీపై ప్రశ్నలు, ప్రశంసలు కురిపించింది. ‘అబ్బే! నేను డాక్టర్‌ను కాను, నా స్నేహితుల్లో ఒకరికి ఇలాగే ఉంది. అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని గ్రహించి స్పందించానంతే!’ వెండీ తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top