భారత్‌పై అణుబాంబులు ఎక్కుపెడుతున్న పాక్‌..!

Pakistan building underground tunnels close to Delhi to store nuclear weapons

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ భారీగా అణు ఆయుధాలు సిద్ధం చేసినట్లు రిపోర్టులు వస్తున్నాయి. దాదాపు 140 అణు ఆయుధాలను తయారు చేసిన పాకిస్తాన్‌ వాటిని దాచేందుకు రహస్య ప్రదేశంలో సొరంగాన్ని నిర్మిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌ పేర్కొంది.

పాకిస్తాన్‌లోని మియన్‌వాలీ పట్టణంలో ఈ సొరంగాన్ని నిర్మించబోతున్నారని చెప్పింది. 10 మీటర్ల ఎత్తు, వెడల్పు కలిగిన మూడు సొరంగాలు పాకిస్తాన్‌ నిర్మణాల్లో ఉంటాయని తెలిపింది. ఈ ప్రదేశానికి లాంచర్లను తీసుకెళ్లేలా భారీ రోడ్లతో కలుపుతున్నట్లు వెల్లడించింది.

మియన్‌వాలీ పట్టణాన్ని స్థావరంగా ఎంచుకోవడం వెనుక పెద్ద ఆలోచన ఉందని పేర్కొంది. మియన్‌వాలీ నుంచి పంజాబ్‌లోని అమృతసర్‌కు దూరం కేవలం 350 కిలోమీటర్లు. అదే న్యూఢిల్లీకైతే 750 కిలోమీటర్లు.

తక్కువ దూరంలో అణు ఆయుధాలను అందుబాటులో ఉంచుకోవడం ద్వారా శత్రువును చావుదెబ్బ కొట్టాలనే వ్యూహం పాకిస్తాన్‌ పన్నినట్లు తెలుస్తోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top