ఒమ్రాన్ సోదరుడి మృతి | Omron brother killed | Sakshi
Sakshi News home page

ఒమ్రాన్ సోదరుడి మృతి

Aug 22 2016 2:32 AM | Updated on Sep 4 2017 10:16 AM

ఒమ్రాన్ సోదరుడి మృతి

ఒమ్రాన్ సోదరుడి మృతి

సిరియా రెబల్స్ అధీనంలో ఉన్న తూర్పు అలెప్పోపై ఈ నెల 17న ప్రభుత్వ దళాలు చేసిన వైమానిక దాడి

బీరుట్ : సిరియా రెబల్స్ అధీనంలో ఉన్న తూర్పు అలెప్పోపై ఈ నెల 17న  ప్రభుత్వ దళాలు చేసిన వైమానిక దాడిలో గాయపడి, రక్తపుచారికలతో అంబులెన్సులో కూర్చొని ఉన్న నాలుగేళ్ల ఒమ్రాన్  గుర్తుండే ఉంటాడు. ఈ బాలుడి ఫొటోకు సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభించింది. అదే దాడిలో గాయపడిన ఒమ్రాన్ అన్న అలీ (10) శనివారం కన్నుమూశాడు.

మరణాన్ని అలెప్పో మీడియా సెంటర్ ధ్రువీకరించింది. ఒమ్రాన్ ఫొటోలు చూసిన అనేకమంది సిరియాలో చిన్నారుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. సిరియాలో ఘర్షణలు మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా  15 వేల మంది చిన్నారులు  సహా 2.90 లక్షల మంది చనిపోయారని అంచనా.

Advertisement
 
Advertisement
Advertisement