బుర్ఖా, నిఖాబ్‌ బ్యాన్‌.. కాదంటే రూ. 10 వేలు ఫైన్‌

Niqab Ban First Person In Denmark Fined For Wearing It - Sakshi

స్టాక్‌హోమ్‌ : డెన్మార్మ్‌లోని హోర్షొల్మ్‌ ప్రాంతంలో ఒక షాపింగ్‌ మాల్‌ దగ్గర ఇద్దరు స్త్రీలు గొడవ పడుతున్నారు. వారిలో ఒక స్త్రీ, మరో ముస్లిం మహిళ(28) ధరించిన ‘నిఖాబ్‌’ / ‘హిజాబ్‌’ (ముఖాన్ని కప్పి ఉంచి వస్త్రం)ను తొలగించే ప్రయత్నం చేస్తోంది. దాంతో ఆ ముస్లిం యువతి ‘నిఖాబ్‌’ తొలగిపోయింది. ఆమె వెంటనే దాన్ని సవరించుకుంది. ఇంతలో పోలీసులు వెళ్లి ఆ గొడవ సద్దుమణిగేలా చేశారు. అనంతరం ఆ ముస్లిం యువతికి జరిమానా విధించారు. అంతేకాక ఇది తొలిసారి కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. ‘ఒకటి జరిమానా చెల్లించాలి లేదా నిఖాబ్‌ ధరించి మీరు బహిరంగ ప్రదేశాలకు రాకుడదు’ అని చెప్పారు. దాంతో ఆ మహిళ రెండో దాన్ని (నిఖాబ్‌ ధరించి బహిరంగ ప్రదేశాలకు రాకుండా ఉండటం) ఎంచుకుంది.

ముస్లిం మహిళ అన్నప్పుడు నిఖాబ్‌ ధరించడం సాంప్రదాయం కదా. మరి జరిమానా ఎందుకు విధించారు..? ఎందుకంటే చాలా యూరోప్‌ దేశాలతో పాటు డెన్మార్క్‌లో కూడా ఈ ఆగస్టు 1 నుంచి ముఖాన్ని కప్పి ఉంచే బుర్ఖా, నిఖాబ్‌, మాస్క్‌లు, స్కార్ఫ్‌లను నిషేధించారు. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు వీటిని ధరించి వస్తే జరిమానా విధిస్తున్నారు. అసలు ముస్లిం మహిళలు అనగానే బుర్ఖా లేదా నిఖాబ్‌ ధరించిన వారి రూపాలు మన కళ్ల ముందు మెదులుతాయి. ముస్లిం దేశాల్లో వీటిని ధరించకుండా ఆడవారు బయటకు రావడం నిషేధం.

కానీ యూరోప్‌ దేశాల్లో ఇందుకు విరుద్ధమైన నిబంధనలు రూపొందిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు మహిళలు బుర్ఖా లేదా నిఖాబ్‌ ధరించ కూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేస్తున్నారు. కానీ ముస్లిం మహిళలు ఇందుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. మానవ హక్కుల సంఘం వారు కూడా వీరికి మద్దతిస్తూ, మహిళల హక్కులను గౌరవించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top