నేపాల్ భూకంపంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 7,912కి చేరింది. ఈ విషయాన్ని నేపాల్ హోంశాఖ శనివారం వెల్లడించింది.
కఠ్మాండు: నేపాల్ భూకంపంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 7,912కి చేరింది. ఈ విషయాన్ని నేపాల్ హోంశాఖ శనివారం వెల్లడించింది. ఏప్రిల్ 25న సంభవించిన భూప్రళయం నేపాల్ను అతలాకుతలం చేసింది. భారీగా ప్రాణ,ఆస్తినష్టం ఏర్పడింది. సుమారు 17,871మంది భూకంప ఘటనలో గాయపడ్డారు. ఇక 2,97,266మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అలాగే 10,803 ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం అయ్యాయి. భీకరంగా విరుచుకుపడిన ఈ భూకంపంలో 264మంది నేపాల్ దేశీయులు, 111మంది విదేశీయలు గల్లంతయ్యారు.