ఆస్టరాయిడ్‌పై నాసా చూపు | NASA to Launch Asteroid-Sampling Mission in 3 Weeks | Sakshi
Sakshi News home page

ఆస్టరాయిడ్‌పై నాసా చూపు

Aug 19 2016 10:30 AM | Updated on Sep 4 2017 9:58 AM

గ్రహాల పుట్టుక, అవి ఏర్పడిన తీరు గురించి తెలుసుకునేందుకు నాసా శాస్త్రవేత్తలు గ్రహశకలాలపై దృష్టిసారించారు.

వాషింగ్టన్: గ్రహాల పుట్టుక, అవి ఏర్పడిన తీరు గురించి తెలుసుకునేందుకు నాసా శాస్త్రవేత్తలు గ్రహశకలాలపై దృష్టిసారించారు. గ్రహశకలాల నమూనాలను సేకరించి, వాటిపై పరిశోధనలు చేయడం ద్వారా గ్రహాల ఆవిర్భావాన్ని గురించి తెలుసుకోవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం  మొట్టమొదటిసారిగా ఆస్టరాయిడ్ శాంపిల్స్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఒసిరిస్-ఆర్‌ఈఎక్స్ అనే అంతరిక్షనౌకను బెన్నూ గ్రహశకలం మీదికి పంపనున్నారు.  సెప్టెంబరు 8న ప్లోరిడాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి... 2018లో బెన్నూ గ్రహశకలాన్ని చేరుతుంది. బెన్నూపై పూర్తిస్థాయి పరిశోధనలు పూర్తయ్యాక ఆ గ్రహశకలానికి చెందిన 60-2000 గ్రాముల శాంపిల్‌ను 2023 నాటికి తీసుకొస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement