రాయల్‌ బేబీ వచ్చేసింది...ప్రిన్స్‌ హ్యారీ ప్రకటన

Meghan the Duchess of Sussex Goes into Labor - Sakshi

మగబిడ్డకు జన్మనిచ్చిన మేఘన్‌ మార్కెల్‌

బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ, మేగన్‌ మార్కెల్‌కు తొలి సంతానం

బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ హ్యారీ,  మేఘన్‌ మార్కెల్‌ దంపతులకు తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ లభించింది. మేఘన్ మార్కెల్ సోమవారం ఉదయం 05:26 గంటకు (స్థానిక సమయం) బాలుడికి జన్మనిచ్చారు.

మార్కెల్‌ పురిటి నొప్పులతో ఈ తెల్లవారుఝామున ఆసుపత్రిలో చేరారని బకింగ్‌ హాం ప్యాలస్‌ సోమవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే ఆ తరువాత  ఈ శుభవార్తను స్వయంగా ప్రిన్స్ హ్యారీ  ఇన్వె‌స్టా‍గ్రామ్‌లో వెల్లడించారు. చాలా థ్రిల్లింగా వుందనీ, తల్లి బిడ్డ క్షేమంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమకు మద్దతు  అందించిన అందరికీ ప్రిన్స్‌ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఇంకా తాము బిడ్డ పేర్ల గురించే ఆలోచిస్తున్నామంటూ సంతోషాన్ని వెలిబుచ్చారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందనల వెల్లువ కురుస్తోంది.  ఈ పోస్ట్‌కు కేవలం 30 నిమిషాల్లోనే ఏడున్నర లక్షలకు పైగా లైక్‌లు  రావడం విశేషం.

క్వీన్ ఎలిజబెత్ -2 ఏడవ ముని మనవడు  అవతరించాడు. యువరాజు చార్లెస్, ప్రిన్స్ విలియమ్,  ప్రిన్స్‌ హ్యారీతోపాటు విలియం ముగ్గురు సంతానం తరువాత ప్రిన్స్‌ హ్యారీ మార్కెల్‌ తొలి  బిడ్డ   బ్రిటిస్‌  రాజ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

మరోవైపు  రాయల్‌ బేబీ ఫోటోను చూడడానికి ఈ రాజదంపతులు హితులు, సన్నిహితులతోపాటు  ప్రపంచవ్యాప్తంగా పలు వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. కాగా ప్రముఖ హాలీవుడ్‌ నటి మేఘన్‌ మార్కెల్‌ను గత ఏడాది మే 19న ప్రిన్స్‌ హ్యారీ వివాహం చేసుకున్నారు. బ్రిటన్‌లోని బెర్క్‌షైర్‌ కౌంటీ విండ్సర్‌లోని సెయింట్‌ జార్జి చర్చిలో  అత్యంత  వైభవంగా  ఈ వివాహ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top