మన దేశం పరిస్థితి ఏమవుతుంది? | Japan to hold emergency meeting over Brexit | Sakshi
Sakshi News home page

మన దేశం పరిస్థితి ఏమవుతుంది?

Jun 25 2016 12:41 PM | Updated on Sep 4 2017 3:23 AM

మన దేశం పరిస్థితి ఏమవుతుంది?

మన దేశం పరిస్థితి ఏమవుతుంది?

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోవడం వల్ల తమ దేశంపై పడే ఆర్థిక ప్రభావం గురించి చర్చించేందుకు జపాన్ ప్రభుత్వ ప్రతినిధులు, బ్యాంక్ ఆఫ్ జపాన్ ప్రతినిధులు ఓ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు.

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోవడం వల్ల తమ దేశంపై పడే ఆర్థిక ప్రభావం గురించి చర్చించేందుకు జపాన్ ప్రభుత్వ ప్రతినిధులు, బ్యాంక్ ఆఫ్ జపాన్ ప్రతినిధులు ఓ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద బ్రెగ్జిట్ ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై ఇందులో ప్రధానంగా చర్చిస్తారు. యెన్ ఎలా ఉండబోతోంది, బ్రిటిష్ ప్రాంతంలో ఉన్న జపనీస్ కంపెనీల పరిస్థితి ఏంటో కూడా సమీక్షిస్తారు.

బ్రెగ్జిట్కు అనుకూలంగా బ్రిటన్ వాసులు ఓటు వేయడంతో టోక్యో స్టాక్ ఎక్స్చేంజి దారుణంగా దెబ్బతింది. జపాన్ కంపెనీల ఎగుమతుల మీద కూడా దీనిప్రభావం గట్టిగానే ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. త్వరలోనే బ్రసెల్స్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని టోక్యో భావిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అశనిపాతంలా తగిలింది. యూకేలో జపాన్ కంపెనీలు 1300కు పైగా ఉన్నాయి. అమెరికా తర్వాత ఈ దేశమే యూకేతో వాణిజ్యం ఎక్కువగా చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement