పాకిస్తాన్‌ వింత ఆరోపణ

Indian farmers reason behind smog in Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ వింత, వితండ వాదన చూస్తుంటే.. ఆడలేనమ్మ మద్దెల ఓడు అన్నట్లుంది. భారత్‌ వల్లే పాకిస్తాన్‌లో పర్యావరణం దెబ్బతింటోందనే వింత వాదన పాకిస్తాన్‌ కొత్తగా తెరమీదకు తెచ్చింది. పాకిస్తాన్‌లో ఏర్పడే పొగమంచు, కాలుష్యానికి భారత రైతులు కారణమంటూ.. పాకిస్తాన్‌ పర్యావరణ పరిరక్షణ విభాగం పేర్కొంది.

పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ప్రజలు గుం‍డె, ఊపిరి తిత్తుల వ్యాధుతో బాధపడుతున్నారని.. ఇందుకు భారత్‌ సరిహద్దులోని రైతులే కారణమని పాకిస్తాన్‌ ఆరోపించింది. సరిహద్దులోని రైతులు వ్యవసాయం పూర్తయ్యాక.. పంటను పొలాల్లోనే అలాగే తగలబెట్టడంతో కాలుష్యం పంజాబ్‌ ప్రావిన్స్‌లోకి వస్తోందని ఐక్యసమితికి పాకిస్తాన్ ఫిర్యాదు చేసిం‍ది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top