డెమొక్రటిక్‌ పార్టీ కమిటీ సీఈవోగా సీమా | Indian-American Appointed CEO of Democratic Party's National Committee | Sakshi
Sakshi News home page

డెమొక్రటిక్‌ పార్టీ కమిటీ సీఈవోగా సీమా

Jul 1 2018 3:16 AM | Updated on Jul 1 2018 3:16 AM

Indian-American Appointed CEO of Democratic Party's National Committee - Sakshi

డెమొక్రటిక్‌ నేషనల్‌ కమిటీ సీఈవో సీమా నంద

వాషింగ్టన్‌: అమెరికాలో డెమొక్రటిక్‌ పార్టీ పాలన విభాగమైన డెమొక్రటిక్‌ నేషనల్‌ కమిటీ(డీఎన్‌సీ) సీఈవోగా భారతీయ అమెరికన్‌ సీమా నంద నియమితులయ్యారు. అమెరికాలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ వ్యవహారాల నిర్వహణలో భారత సంతతికి చెందిన వ్యక్తి కీలక పాత్ర పోషించడం ఇదే తొలిసారి. వచ్చే నెల్లో బాధ్యతలు చేపట్టనున్న ఆమె డీఎన్‌సీ రోజువారీ కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తారు. ప్రస్తుత డీఎన్‌సీ చైర్మన్‌ టామ్‌ పెరెజ్‌ అమెరికా కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయంలో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా సీమా∙పనిచేశారు. ‘జీవితకాలంలో ఒక్కసారే ఇలాంటి పదవి దక్కుతుంది’ అని ఆమె చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement