అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఒక మహిళ సహా దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. ఐదుగురు గాయపడ్డారు.
- ఒకరి మృతి
- పోలీసుల కాల్పుల్లో దుండగుడి హతం
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఒక మహిళ సహా దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. ఐదుగురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఫిలడెల్ఫియాలో మహిళా పోలీసు అధికారి సిల్వియా యంగ్‌పై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆమె త్రుటిలో తప్పిం చుకోగా... పోలీసులు వెంబడించడంతో దుండగుడు దగ్గర్లోని బార్‌లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించాడు.
సెక్యూరిటీ గార్డుతో పాటు ఒక మహిళ కాలుపై కాల్పులు జరిపాడు. అనంతరం ఒక జంటపై జరిపిన కాల్పుల్లో మహిళ ప్రాణాలు కోల్పోయింది. అనంతరం పోలీసులు అతన్ని చుట్టుముట్టి హతమార్చారు. అయితే దుండగుడి ఉద్దేశాలు ఇంకా స్పష్టం కాలేదని పోలీసులు తెలిపారు. అతడి వివరాలను బహిర్గతం చేయలేదు. పోలీసులను ద్వేషిస్తూ అతడు నోటు వదిలిపెట్టాడని మీడియాలో వార్తలు వెలువడ్డాయి.