ఎతిహాడ్ ఏయిర్‌వేస్‌ కీలక ప్రకటన

Etihad Airways Want To Sell 38 Aircraft Altavair Air Finance And KKR - Sakshi

దుబాయ్‌: అబుదాబికి చెందిన ఎతిహాడ్ ఏయిర్‌వేస్‌ మంగళవారం కీలక ప్రకటన చేసింది. వంద కోట్ల అమెరికన్‌ డాలర్ల ఒప్పందంలో భాగంగా తన 38 ఏయిర్‌ విమానాలను పెట్టుబడి సంస్థ కేకేఆర్‌, లీజింగ్‌ కంపెనీ ఆల్టవైర్ ఎయిర్ ఫైనాన్స్‌కు విక్రయించనున్నట్లు పేర్కొంది. తాజా ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా ఎతిహాడ్‌ ఎయిర్‌వేస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

38 ఏయిర్‌ విమానాలు, 22 ఏయిర్‌ బస్‌-A330, 16 బోయింగ్‌ 7777- 300ER లను ఒప్పందంలో భాగంగా పెట్టుబడి సంస్థ కేకేఆర్‌, లీజింగ్‌ కంపెనీ ఆల్టవైర్ ఎయిర్ ఫైనాన్స్‌లకు విక్రయించినట్లు ఎతిహాడ్‌ ఏయిర్‌ వేస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 2020 ప్రారంభంలో కొనుగోలు చేసిన బోయింగ్‌ 777-300ER విమానాలను తిరిగి ఎతిహాడ్‌ సంస్థకు లీజుకు ఇస్తామని.. అదేవిధంగా ఏయిర్‌బస్‌ A330లను అంతర్జాతీయ ఖాతాదారులకు కేటాయిస్తామని కేకేఆర్‌ సంస్థ పేర్కొంది. ఈ ఒప్పందం స్థిరత్వాన్ని అందిస్తోందని.. అదే విధంగా తమ లక్ష్యాలకు అండగా నిలడబతుందని  ఎతిహాడ్‌ సంస్థ తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top