బ్రిటన్‌ రాణికి, రాజుకు ఏమైంది? | emergency meet at Buckingham.. sparks speculation about health of royals | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ రాణికి, రాజుకు ఏమైంది?

May 4 2017 12:13 PM | Updated on Sep 5 2017 10:24 AM

బ్రిటన్‌ రాణికి, రాజుకు ఏమైంది?

బ్రిటన్‌ రాణికి, రాజుకు ఏమైంది?

బ్రిటన్‌ రాణి, రాజు అధికారిక భవనం బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ఉ‍ద్యోగులతో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశం కలకలం రేపింది. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌, ఆమె భర్త ప్రిన్స్‌ పిలిప్‌ ఆరోగ్యంపై ఊహాగానాలు బయలుదేరాయి.

లండన్‌: బ్రిటన్‌ రాణి, రాజు అధికారిక భవనం బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ఉ‍ద్యోగులతో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశం కలకలం రేపింది. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌, ఆమె భర్త ప్రిన్స్‌ పిలిప్‌ ఆరోగ్యంపై ఊహాగానాలు బయలుదేరాయి. వారికేమైనా అయిందా అనే ఆందోళనలు బయలుదేరాయి. చాలామంది ప్యాలెస్‌పై జెండా వైపు కూడా చూశారు. సాధారణంగా ప్యాలెస్‌లో ఎవరైనా చనిపోవడంలాంటి సంఘటనలు జరిగితే జెండాను అవనతం చేసి ఎగురవేస్తారని, అలాంటిదేమైనా జరిగిందేమోనని జెండావైపు చూసి నెమ్మదించారు.

అయితే, ఈ సమావేశం ఎప్పటి మాదిరిగానే జరిగే సమావేశమేనని, రాజు, రాణి ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ అధికారిక ప్రతినిధి ఒక ప్రకటన చేశారు. తాజాగా రాయల్‌ స్టాఫ్‌ ఆఫీసర్లు, లార్డ్‌ చాంబర్లెయిన్‌, ఎలిజెబెత్‌ ప్రైవేట్‌ సెక్రటరీ క్రిస్టోఫర్‌ గైట్‌ ఏర్పాటుచేశారని, అందుకే ఈ అత్యవసర సమావేశం జరిగిందే తప్ప ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌కు 91 ఏళ్లుకాగా.. ప్రిన్స్‌ ఫిలిప్‌ వచ్చే నెలలో 96లోకి అడుగుపెట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement