
ఫిలిప్పీన్స్ లో భూ ప్రకంపనలు
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదైంది. మనీలాకు దక్షిణ దిశగా దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో 42 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు.
తలాగ అనే పట్టణానికి సమీపంలో భూకంప తీవ్రత నమోదైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత కొన్ని రోజులుగా భూకంపం వచ్చే పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించినట్లు అధికారులు వివరించారు.