మోదీతో అమెరికా మంత్రులు | Donald Trump's 'true friend' tweet sets tone for meeting with Modi | Sakshi
Sakshi News home page

మోదీతో అమెరికా మంత్రులు

Jun 27 2017 12:39 AM | Updated on Apr 4 2019 3:25 PM

మోదీతో అమెరికా మంత్రులు - Sakshi

మోదీతో అమెరికా మంత్రులు

మోదీతో అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు జేమ్స్‌ మాటిస్, రెక్స్‌ టిల్లర్సన్‌లు సోమవారం విడివిడిగా భేటీ అయ్యారు.

వాషింగ్టన్‌: మోదీతో అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు జేమ్స్‌ మాటిస్, రెక్స్‌ టిల్లర్సన్‌లు సోమవారం విడివిడిగా భేటీ అయ్యారు. మోదీ బసచేసిన హోటల్‌ విలార్డ్‌ కాంటినెంటల్‌లో జరిగిన సమావేశాల్లో ఆయా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలపేతంపై చర్చలు జరిపారు.

మాటిస్‌తో జరిగిన భేటీలో భారత జాతీయ సలహాదారు అజిత్‌ దోవల్, ఇతర భారత సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. భారత నిఘా అవసరాల కోసం అమెరికా 22 ‘గార్డియన్‌’ డ్రోన్లను అమ్మనుందన్న వార్తల నేపథ్యంలో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు మూడు బిలియన్‌ డాలర్ల విలువైన ఈ ఒప్పందం ఇరు దేశాల సంబంధాలను కీలక మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు.  కాగా, ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై టిల్లర్సన్, మోదీలు చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement