మరోసారి 'కోసి' పారేసిన భార్య! | Chinese woman does it again, bobbitises hubby one more time | Sakshi
Sakshi News home page

మరోసారి 'కోసి' పారేసిన భార్య!

Published Tue, Mar 11 2014 10:10 PM | Last Updated on Mon, Aug 13 2018 3:32 PM

ఒక సారి చేస్తే పొరబాటు.... మరో సారి చేస్తే అలవాటు.... ఆ భార్యా భర్తలకు పొరబాటు అలవాటైపోయింది.

ఒక సారి చేస్తే పొరబాటు.... మరో సారి చేస్తే అలవాటు.... ఆ భార్యా భర్తలకు పొరబాటు అలవాటైపోయింది. సెకెండ్ సెటప్ అనుమానంతో భార్య భర్తకి పాలల్లో మత్తుమందు కలిపి మరీ పురుషాంగాన్ని కోసేసింది. కుయ్యో మొర్రో అని భర్త డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. ఎలాగోలా కుట్లు వేయించుకుని అయిందనిపించుకున్నాడు. 'నాకీ పెళ్లాం వద్దు. విడాకులు కావాలి' అని డిమాండ్ చేశాడు. మితి మీరిన ప్రేమే అతి హింసకు కారణం అని ఆమె కాళ్లా వేళ్లా పడింది. పోనీలెమ్మని ఇద్దరూ మళ్లీ కలిసి జీవించసాగారు. నెల కూడా పూర్తికాలేదు. గాయం కూడా ఆరలేదు. అంతలోనే అఘాయిత్యం జరిగిపోయింది.

ఆమెకు అనుమానం జాస్తి. అయ్యగారు కూడా అపరకృష్ణుడు. అందుకే మళ్లీ పాలల్లో మత్తు మందు కలిపింది. అయ్యవారికి తాగించింది. మనోడు మళ్లీ పాలు తాగేశాడు. మొద్దు నిద్ర పోయాడు. కళ్లు తెరిచే సరికి 'ఉన్నదంతా' మరో సారి పోయింది. లబోదిబో మంటూ మరోసారి ఆయన ఆస్పత్రికి, ఈమె పోలీస్ స్టేషన్ కి పరుగులు తీశారు.

అయ్యవారి పేరు హాన్ మౌ. ఆమ్మగారి పేరు ఝాంగ్. వీరిద్దరిదీ చైనా దేశం. ఈ సారైనా కథ మళ్లీ రిపీట్ కాకుండా ఇద్దరూ జాగ్రత్త పడతారా లేదా అన్నది నవచైనా వార్తాపత్రికల్లో చూసి తెలుసుకోవాల్సిందే.

పురుషాంగాన్ని కోసి పారేయడాన్ని ఇంగ్లీష్ లో బాబిటైజేషన్ అంటారు. బాబిట్ అనే వీధిలో కృష్ణుడిని ఇంట్లో రామయ్యగా చేసేందుకు ఆయన భార్య 1993 లో తొలిసారి ఈ పని చేసింది. అప్పట్నించే ఆ పేరే నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement