bobbitisation
-
ప్రేమించినందుకు జననాంగాన్ని కోసేశారు
ఏడాదిన్నరగా వాళ్లిద్దరి మధ్యా రహస్య ప్రేమ కొనసాగుతోంది. ఈ మధ్యే అమ్మాయి ఇంట్లో వాళ్లకి కూడా ఈ సంగతి తెలిసింది. అప్పట్నుంచీ వాళ్లు కత్తులు నూరుతున్నారు. అయితే వేడిలో ఉన్న కుర్రాడు ఇదేదీ పట్టించుకోలేదు. అనుకోకుండా అమ్మాయి ఇంటికి వెళ్లే చాన్సు వచ్చింది. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ పరుగు పరుగున వెళ్లాడు. అమ్మాయి ఇంట్లోకి వెళ్లిన మరుక్షణం ఆమె అన్నలిద్దరూ అతడిని ఒడిసి పట్టుకున్నారు. ఓ కుర్చీకి కట్టేశారు. ఆ తరువాత బాగా సానపట్టి రెడీగా పెట్టుకున్న కత్తులతో అతని జననాంగాన్ని కోసి పారేశారు. ఇప్పుడా కుర్రాడు పాపం ఆస్పత్రి పాలయ్యాడు. అన్నలిద్దరూ జైలు పాలయ్యారు. అమ్మాయిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన బీహార్ లోని సివాన్ జిల్లాలోని అసాంవ్ గ్రామంలో జరిగింది. అబ్బాయి పేరు సుబోధ్. సుబోధ్ ను ముందు సివాన్ కి, తరువాత పాట్నాకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. -
మరోసారి 'కోసి' పారేసిన భార్య!
ఒక సారి చేస్తే పొరబాటు.... మరో సారి చేస్తే అలవాటు.... ఆ భార్యా భర్తలకు పొరబాటు అలవాటైపోయింది. సెకెండ్ సెటప్ అనుమానంతో భార్య భర్తకి పాలల్లో మత్తుమందు కలిపి మరీ పురుషాంగాన్ని కోసేసింది. కుయ్యో మొర్రో అని భర్త డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. ఎలాగోలా కుట్లు వేయించుకుని అయిందనిపించుకున్నాడు. 'నాకీ పెళ్లాం వద్దు. విడాకులు కావాలి' అని డిమాండ్ చేశాడు. మితి మీరిన ప్రేమే అతి హింసకు కారణం అని ఆమె కాళ్లా వేళ్లా పడింది. పోనీలెమ్మని ఇద్దరూ మళ్లీ కలిసి జీవించసాగారు. నెల కూడా పూర్తికాలేదు. గాయం కూడా ఆరలేదు. అంతలోనే అఘాయిత్యం జరిగిపోయింది. ఆమెకు అనుమానం జాస్తి. అయ్యగారు కూడా అపరకృష్ణుడు. అందుకే మళ్లీ పాలల్లో మత్తు మందు కలిపింది. అయ్యవారికి తాగించింది. మనోడు మళ్లీ పాలు తాగేశాడు. మొద్దు నిద్ర పోయాడు. కళ్లు తెరిచే సరికి 'ఉన్నదంతా' మరో సారి పోయింది. లబోదిబో మంటూ మరోసారి ఆయన ఆస్పత్రికి, ఈమె పోలీస్ స్టేషన్ కి పరుగులు తీశారు. అయ్యవారి పేరు హాన్ మౌ. ఆమ్మగారి పేరు ఝాంగ్. వీరిద్దరిదీ చైనా దేశం. ఈ సారైనా కథ మళ్లీ రిపీట్ కాకుండా ఇద్దరూ జాగ్రత్త పడతారా లేదా అన్నది నవచైనా వార్తాపత్రికల్లో చూసి తెలుసుకోవాల్సిందే. పురుషాంగాన్ని కోసి పారేయడాన్ని ఇంగ్లీష్ లో బాబిటైజేషన్ అంటారు. బాబిట్ అనే వీధిలో కృష్ణుడిని ఇంట్లో రామయ్యగా చేసేందుకు ఆయన భార్య 1993 లో తొలిసారి ఈ పని చేసింది. అప్పట్నించే ఆ పేరే నిలిచిపోయింది.