ప్రేమించినందుకు జననాంగాన్ని కోసేశారు | Boy bobbitised for falling in love | Sakshi
Sakshi News home page

ప్రేమించినందుకు జననాంగాన్ని కోసేశారు

May 10 2014 3:36 PM | Updated on Sep 2 2017 7:11 AM

ఇంట్లోకి వెళ్లిన మరుక్షణం ఆమె అన్నలిద్దరూ అతడిని ఒడిసి పట్టుకున్నారు. బాగా సానపట్టి రెడీగా పెట్టుకున్న కత్తులతో అతని జననాంగాన్ని కోసి పారేశారు.

ఏడాదిన్నరగా వాళ్లిద్దరి మధ్యా రహస్య ప్రేమ కొనసాగుతోంది. ఈ మధ్యే అమ్మాయి ఇంట్లో వాళ్లకి కూడా ఈ సంగతి తెలిసింది. అప్పట్నుంచీ వాళ్లు కత్తులు నూరుతున్నారు. అయితే వేడిలో ఉన్న కుర్రాడు ఇదేదీ పట్టించుకోలేదు. 
 
అనుకోకుండా అమ్మాయి ఇంటికి వెళ్లే చాన్సు వచ్చింది. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ పరుగు పరుగున వెళ్లాడు. అమ్మాయి ఇంట్లోకి వెళ్లిన మరుక్షణం ఆమె అన్నలిద్దరూ అతడిని ఒడిసి పట్టుకున్నారు. ఓ కుర్చీకి కట్టేశారు. ఆ తరువాత బాగా సానపట్టి రెడీగా పెట్టుకున్న కత్తులతో అతని జననాంగాన్ని కోసి పారేశారు. 
 
ఇప్పుడా కుర్రాడు పాపం ఆస్పత్రి పాలయ్యాడు. అన్నలిద్దరూ జైలు పాలయ్యారు. అమ్మాయిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఈ సంఘటన బీహార్ లోని సివాన్ జిల్లాలోని అసాంవ్ గ్రామంలో జరిగింది. అబ్బాయి పేరు సుబోధ్. సుబోధ్ ను ముందు సివాన్ కి, తరువాత పాట్నాకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement