జపాన్‌ ప్రధానికి తీవ్ర అవమానం

Chef Serves Dessert In A Shoe To Shinzo Abe In Israel - Sakshi

టెల్‌అవీవ్‌, ఇజ్రాయెల్‌ : ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న జపాన్‌ ప్రధాని షింబో అబేకు తీవ్ర అవమానం జరిగింది. ఇజ్రాయెల్‌ ప్రధాని కుటుంబంతో కలసి విందుకు హాజరైన అబేకు చెఫ్‌ బూటులో ఆహార పదార్థాలను ఉంచి సర్వ్‌ చేయడం వివాదాస్పదంగా మారింది.

నెతన్యాహు అత్యంత ఇష్టపడే చెఫ్‌ మోషే సెర్గీ ఈ విందుకు వంటకాలను తయారు చేశారు. అబేకు డిసర్ట్‌తో పాటు ఓ బూటులో చాకెట్లను ఉంచి సర్వ్‌ చేయడంపై జపాన్‌ దౌత్యవేత్తలు భగ్గమన్నారు. బూటుతో ఆహారాన్ని అందించడాన్ని జపాన్‌లో తీవ్రంగా, ఘోర అవమానంగా భావిస్తారని చెప్పారు.

ఘటనపై చెఫ్‌ సెర్గీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అది నిజమైన షూ కాదని, మెటల్‌తో తయారు చేసిన వస్తువని వెల్లడించారు. కాగా, భోజన వడ్డన సమయంలో సెర్గీ వివాదాల్లో ఇరుక్కోవడం ఇది తొలిసారేమీ కాదు. గతేడాది నవంబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్‌, నెతన్యాహూల ముఖచిత్రాలు కలిగిన బౌల్స్‌లో సెర్గీ డిసర్ట్స్‌ను సర్వ్‌ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top