పూడ్చిపెట్టిన 8 గంటల తర్వాత..

Born Baby Buried Alive Cops Saves Her - Sakshi

రియో డీ జెనీరో, బ్రెజిల్‌ : పుట్టుకతోనే మరణించిదనకున్న పాప పూడ్చిపెట్టిన ఎనిమిది గంటల తర్వాత ఏడ్చిన ఆశ్చర్యకర సంఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. జన్మించినప్పుడే బేబీ మరణించిందని అనుకుని పూడ్చిపెట్టినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే కొద్దిగంటల అనంతరం అటుగా వెళ్తున్న పోలీసులకు ఏడుపు వినిపించింది.

హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న వారు టార్చ్‌లైట్‌ వెలుతురులో బేబీని మట్టిలో నుంచి బయటకు తీశారు. అనంతరం శ్వాస ఆడేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బేబీ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top