సైకిల్ బాంబు పేలుడు: 12 మందికి గాయాలు | Blast injures 12 in Pakistan | Sakshi
Sakshi News home page

సైకిల్ బాంబు పేలుడు: 12 మందికి గాయాలు

Sep 21 2014 9:05 AM | Updated on Mar 23 2019 8:36 PM

పాకిస్థాన్ జిన్నా పట్టణంలో సుమంగళి హౌసింగ్ సొసైటీ సమీపంలోని గత అర్థరాత్రి శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది.

కరాచీ : పాకిస్థాన్ జిన్నా పట్టణంలో సుమంగళి హౌసింగ్ సొసైటీ సమీపంలోని గత అర్థరాత్రి శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో12 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు ఉన్నతాధికారి తెలిపారు. క్షతగాత్రులను పట్టణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. సొసైటీ సమీపంలోని హోటల్ వద్ద శక్తిమంతమైన బాంబును టైమర్ అమర్చారని వెల్లడించారు.

బాంబు పేలుడు సంభవించిన సమయంలో హోటల్ సమీపంలోన జనాభా చాలా తక్కువగా ఉన్నారని చెప్పారు. ఈ పేలుళ్ల దాటికి సమీపంలోని భవనాలు, ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయని చెప్పారు. బెలూచిస్థాన్ ప్రావెన్స్లో గత కొన్ని నెలలుగా కొన్ని అరాచక శక్తులు విధ్వంస దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement