breaking news
powerful blast
-
హోం మంత్రి కార్యాలయంలో బాంబు పేలుడు
పాకిస్థాన్ : పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని హోం మంత్రి కార్యాలయంలో ఆదివారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. హోం మంత్రి షుజా ఖాన్జాదాతోపాటు మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు దాటికి కార్యాలయంలోని పైకప్పు కుప్పకూలడంతో వీరంత గాయపడినట్లు మీడియా వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఆత్మాహుతి దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కానీ ఈ విషయాన్ని ఉన్నతాధికారులు మాత్రం ధృవీకరించడం లేదు. అయితే గతేడాది ఆక్టోబర్‌లో షుజా హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తీవ్రవాదులు, వారి సంస్థలపై షుజా ఉక్కుపాదంతో అణిచి వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
సైకిల్ బాంబు పేలుడు: 12 మందికి గాయాలు
కరాచీ : పాకిస్థాన్ జిన్నా పట్టణంలో సుమంగళి హౌసింగ్ సొసైటీ సమీపంలోని గత అర్థరాత్రి శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో12 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు ఉన్నతాధికారి తెలిపారు. క్షతగాత్రులను పట్టణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. సొసైటీ సమీపంలోని హోటల్ వద్ద శక్తిమంతమైన బాంబును టైమర్ అమర్చారని వెల్లడించారు. బాంబు పేలుడు సంభవించిన సమయంలో హోటల్ సమీపంలోన జనాభా చాలా తక్కువగా ఉన్నారని చెప్పారు. ఈ పేలుళ్ల దాటికి సమీపంలోని భవనాలు, ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయని చెప్పారు. బెలూచిస్థాన్ ప్రావెన్స్లో గత కొన్ని నెలలుగా కొన్ని అరాచక శక్తులు విధ్వంస దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే.