‘పేస్‌మేకర్’ ఆల్‌ఫ్రెడ్ ఇకలేరు | Alfred E. Mann dies; helped develop pacemakers | Sakshi
Sakshi News home page

‘పేస్‌మేకర్’ ఆల్‌ఫ్రెడ్ ఇకలేరు

Feb 28 2016 9:16 AM | Updated on Sep 3 2017 6:37 PM

‘పేస్‌మేకర్’ ఆల్‌ఫ్రెడ్ ఇకలేరు

‘పేస్‌మేకర్’ ఆల్‌ఫ్రెడ్ ఇకలేరు

ప్రముఖ వ్యాపారవేత్త, దాత, ఆవిష్కర్త ఆల్‌ఫ్రెడ్ ఈ మన్(90) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు.

లాస్‌ఏంజెలస్: ప్రముఖ వ్యాపారవేత్త, దాత, ఆవిష్కర్త ఆల్‌ఫ్రెడ్ ఈ మన్(90) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. వైమానిక సేవలు, ఫార్మా, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, బయో మెడికల్ పరిశోధనలతో పాటు అనేక రంగాల్లో  తన వ్యాపారాన్ని విస్తరించారు. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న వలెన్సియా కంపెనీకి 2001 నుంచి ఈ నెల ఆరంభం వరకు ఆయన చైర్మన్‌గా పనిచేశారు.

మాన్ ఆధ్వర్యంలోనే మొట్టమొదటి రీచార్జ్‌బుల్ పేస్‌మేకర్, పీల్చే ఇన్సులిన్ అభివృద్ధి పరిచారు. అమెరికా సైన్యం, అంతరిక్ష పరిశోధ నల కోసం తన కంపెనీల్లో సోలార్ సెల్స్, సెమీ కండక్టర్‌లను ఉత్పత్తి చేయడంతో పాటు అనేక విధాలుగా సాంకేతిక సహాయాన్ని అందించారు. హృద్రోగులకు పేస్‌మేకర్లు, మధుమేహ రోగులకోసం ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం ద్వారా వేల కోట్లు సంపాదించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement