బ్రెయిన్ సైజ్కు దానికి సంబంధం! | A longer yawn may correlate to a bigger brain size | Sakshi
Sakshi News home page

బ్రెయిన్ సైజ్కు దానికి సంబంధం!

Oct 10 2016 11:19 AM | Updated on Sep 4 2017 4:54 PM

బ్రెయిన్ సైజ్కు దానికి సంబంధం!

బ్రెయిన్ సైజ్కు దానికి సంబంధం!

బ్రెయిన్ సైజ్ ఎంతో తెలుసుకోవాలంటే ఎంతపెద్దగా(ఎంత ఎక్కువ సమయం) ఆవులింత వస్తుందో తెలుసుకుంటే సరిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

న్యూయార్క్: బ్రెయిన్ సైజ్ ఎంతో తెలుసుకోవాలంటే ఎంతపెద్దగా(ఎంత ఎక్కువ సమయం) ఆవులింత వస్తుందో తెలుసుకుంటే సరిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు సుమారు 29 రకాల క్షీరదాల ఆవులింతలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్థారించారు. జీవుల్లో ఎంత అంతపెద్ద బ్రెయిన్ ఉంటే అంత ఎక్కువ సమయం ఆవులింత వస్తుందని వారు తెలిపారు.
 
మెదడు బయటిపొరలోని నాడీకణాల సంఖ్య, బ్రెయిన్ సైజ్ ఈ రెండూ ఆవులింత పరిమాణాన్ని నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉదాహారణకు గొరిల్లాలు, గుర్రాలు, ఆఫ్రికన్ ఏనుగుల ఆవులింతల పరిమాణం చిన్నగా ఉంటుందని, దీనికి కారణం శరీర పరిమాణంతో పోల్చినప్పుడు మన మెదడు పరిమాణం కంటే వాటి మొదడు పరిమాణం ఉండాల్సిన స్థాయిలో ఉండకపోవడమే అని వెల్లడించారు. ఆవులింత ఎంతపెద్దగా వస్తుందనే విషయం శరీరం ఎంతపెద్దగా ఉందనేదానిపై కాకుండా మెదడు ఎంతపెద్దగా ఉందనే విషయంపై ఆదారపడుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఆండ్రూ గాల్లప్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement