గూగుల్‌ బాస్‌.. ఉద్యోగం ఇవ్వండి | A 7-year-old girl asked Google for a job and got a personal response from CEO Sundar Pichai | Sakshi
Sakshi News home page

గూగుల్‌ బాస్‌.. ఉద్యోగం ఇవ్వండి

Feb 17 2017 1:28 AM | Updated on Sep 5 2017 3:53 AM

గూగుల్‌ బాస్‌.. ఉద్యోగం ఇవ్వండి

గూగుల్‌ బాస్‌.. ఉద్యోగం ఇవ్వండి

గూగుల్‌లో ఉద్యోగం కావాలంటూ ఏడేళ్ల ఒక చిన్నారి పెట్టుకున్న దరఖాస్తుకు ఆ సంస్థ సీఈవో సుందర్‌పిచాయ్‌ సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్చ పరిచారు.

ఏడేళ్ల చిన్నారి లేఖ ∙స్పందించిన సుందర్‌పిచాయ్‌
లండన్: గూగుల్‌లో ఉద్యోగం కావాలంటూ ఏడేళ్ల ఒక చిన్నారి పెట్టుకున్న దరఖాస్తుకు ఆ సంస్థ సీఈవో సుందర్‌పిచాయ్‌ సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్చ పరిచారు. ఇంగ్లండ్‌లోని హియర్‌ఫోర్డ్‌కు చెందిన ఏడేళ్ల క్లో బ్రిడ్జ్‌వాటర్‌ సరదాగా ఒకరోజు తాను ఎక్కడ పనిచేస్తే బాగుంటుందో చెప్పాలంటూ తన తండ్రిని అడిగింది. దీనికి గూగుల్‌ అయితే బాగుంటుందని పాప తండ్రి ఆండీ బదులిచ్చాడు. వెంటనే ఆ అమ్మాయి గూగుల్‌ సీఈవో పిచాయ్‌ను ‘గూగుల్‌ బాస్‌’ అని సంభోదిస్తూ ఉద్యోగం కోసం లేఖ రాసింది. తాను చదువులో బాగా ముందుంటానని టీచర్లు కితాబిచ్చినట్లు ఆ లేఖలో చెప్పుకొచ్చింది.

తనకు కంప్యూటర్, స్విమ్మింగ్‌ అంటే బాగా ఇష్టమని, స్విమ్మింగ్‌లో ఒలింపిక్‌ పతకం సాధిస్తానని తెలిపింది. తన తండ్రి ఇచ్చిన ట్యాబ్లెట్‌లో తాను రోబో ఆటను ఆడతానని, దానిద్వారా కంప్యూటర్ల గురించి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని తన తండ్రి చెప్పినట్లు వివరించింది. దీనికి పిచాయ్‌ సమాధానమిస్తూ.. ‘నీ లేఖకు కృతజ్ఞతలు. నీకు కంప్యూటర్లు, రోబోలు ఇష్టమన్నావు. టెక్నాలజీ గురించి ఇంకా తెలుసుకోవడం కొనసాగిం చు. ఎప్పుడూ ఇలాగే కష్టపడు. గూగుల్‌లో పని చేయడం, ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతో పాటు అన్ని లక్ష్యాలను చేరుకుంటావని భావిస్తున్నాను. నీ చదువు పూర్తవగానే గూగుల్‌కి మళ్లీ దరఖాస్తు చేసుకో’ అంటూ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement