ఎవరెస్ట్‌ పర్వతంపైనా 5జీ సిగ్నల్‌

5G Signal Now Available on Mount Everest Peak - Sakshi

బీజింగ్‌: ప్రపంచంలోకెల్లా ఎత్తైన హిమాలయ పర్వతాలపై 5జీ సిగ్నల్‌ లభించనుంది. టిబెట్‌ చైనా సరిహద్దుల్లోని హిమాలయ పర్వతం వైపు ఈ సిగ్నల్‌ అందుబాటులో ఉంటుందని చైనా తెలిపింది. ప్రస్తుతం 5,800 మీటర్ల వరకు బేస్‌ క్యాంప్‌ లు ఉన్నాయి. 6,500 మీటర్ల వద్ద ఇటీవల నిర్మించిన బేస్‌ స్టేషన్‌లో పనులు ప్రారంభం కావడంతో శిఖరంపై వరకు 5జీ అందుబాటులోకి వచ్చింది. ఎవరెస్ట్‌పై 5జీ స్టేషన్లను నిర్మించడం చాలా శ్రమతో కూడుకున్నదని, వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు 10 మిలియన్ యువాన్ల(1.42 మిలియన్‌ డాలర్లు)కు చేరుకుంటుందని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు చెప్పినట్టు గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులకు సమాచారం అందించడానికి 5జీ స్టేషన్లు సహాయపడతాయి. కార్మికులను, పరిశోధకులను రక్షించడానికి 5జీ నెట్‌వర్క్‌ దోహపడుతుందని నిపుణులు అంటున్నారు.

5జీ అనేది వైర్‌లెస్‌ కమ్యూనికేషన్ టెక్నాలజీలలో ఐదవ తరంగా పేర్కొంటున్నారు. వేగవంతమై డేటాతో పాటు ఎక్కువ బ్యాండ్‌విడ్త్, నెట్‌వర్క్ సామర్థ్యాన్ని 5జీ కలిగివుంటుంది. ఎక్కువ పరికరాలు కనెక్ట్‌ చేయడానికి, అత్యంత నాణ్యతతో వర్చువల్ సమావేశాలు నిర్వహించుకోవడానికి, టెలిమెడిసిన్‌కు 5జీ మార్గం సుగమం చేస్తుందని  భావిస్తున్నారు. (అమెరికాలో అమెజాన్ బాస్‌కు చిక్కులు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top