భారతీయ జవాన్లకు గాయాలు | 21 indian army persons wounded in collied | Sakshi
Sakshi News home page

భారతీయ జవాన్లకు గాయాలు

Jun 19 2015 11:18 AM | Updated on Apr 3 2019 7:53 PM

భారతీయ జవాన్లకు గాయాలు - Sakshi

భారతీయ జవాన్లకు గాయాలు

భారత్-బ్రిటన్ సంయుక్త సైన్యం రోజువారి కార్యక్రమాల్లో పాల్గొని వస్తుండగా జరిగిన ప్రమాదంలో 21 మంది భారతీయ సైనికులకు, ఇద్దరు బ్రిటన్ సైనికులకు గాయాలయ్యాయి.

లండన్: భారత్-బ్రిటన్ సంయుక్త సైన్యం రోజువారి కార్యక్రమాల్లో పాల్గొని వస్తుండగా జరిగిన ప్రమాదంలో 21 మంది భారతీయ సైనికులకు, ఇద్దరు బ్రిటన్ సైనికులకు గాయాలయ్యాయి. మిలటరీ పరికరాలు మోసుకొస్తున్న రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఏడాది జూన్ 13 నుంచి 28 వరకు బ్రిటన్లోని సాలిస్బరీ మైదానంలో ఇరు దేశాల సైనికులు ప్రత్యేక శిక్షణలో పాల్గొన్నారు.

దీంతోపాటు అనంతర కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా తిరిగొస్తుండగా ప్రమాద బారిన పడ్డారు. ఈ రెండు వాహనాలను నడిపింది బ్రిటన్ సైనికులే. గాయపడినవారిని వెంటనే హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రులకు తరలించారు. ఒక కెప్టెన్, హవల్దారు తీవ్రంగా గాయపడగా మిగితావారు మాత్రం స్వల్ఫ గాయాలతో బయటపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement