4న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం | ysrcp state executive meeting on 4th april | Sakshi
Sakshi News home page

4న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

Apr 2 2016 3:09 AM | Updated on Nov 9 2018 5:52 PM

ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ సెంట్రల్ ఆఫీసు ఆవరణలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ సెంట్రల్ ఆఫీసు ఆవరణలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో రాష్ట్రంలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయిల్లో సంస్థాగతంగా మరింత బలోపేతం చేయటంపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న కరువు, మంచినీటి సమస్య, ప్రాజెక్టుల రీడిజైన్, రైతుల సమస్యలు, ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలిపారు.  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు హాజరు కావాలని శివకుమార్ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement