నాచారం పరిధిలోని మల్లాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి అరుణ్(32) అనే కూలీ మృతిచెందాడు.
నాచారం పరిధిలోని మల్లాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి అరుణ్(32) అనే కూలీ మృతిచెందాడు. భవనంపై నుంచి పడినపుడు కొన ఊపిరి ఉండటంతో స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే అరుణ్ మృతిచెందాడు. అరుణ్ స్వస్థలం మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం నాగులకట్ట గ్రామం. నగరానికి పదిరోజుల క్రితమే వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.